Ahead of Ivanka Trump’s visit to Hyderabad to attend the Global Entrepreneurship Summit at the end of this month, the city Police has launched a massive drive to remove beggars from the streets, saying “these acts are dangerous to the safety of the vehicular traffic and public in general”.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసుల అత్యుత్సాహంపై విమర్శల వెల్లువెత్తుతున్నాయి. భాగ్యనగరాన్ని వీలైనంత త్వరలో 'బెగ్గర్ ఫ్రీ సిటీ'గా మార్చాలనే ఉద్దేశంతో హైదరాబాద్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ నవ్వులపాలవుతోంది. ఏ వ్యక్తి అయినా కాస్త చిరిగిన దుస్తులు, మాసిన గెడ్డంతో కనిపిస్తే చాలు.. హైదరాబాద్ పోలీసులు 'డౌట్ లేదు.. బిచ్చగాడే..' అనుకుంటున్నారు.
హైదరాబాద్‌ను బెగ్గర్ ఫ్రీ సిటీగా చేయడంలో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ.. చంచల్‌గూడ జైల్లో ఆనందాశ్రమాన్ని ఏర్పాటు చేసింది. నగరంలోని ఆయా కూడళ్ల వద్ద ఉండే బిచ్చగాళ్లను తీసుకువచ్చి అందులో చేర్పించాలని పోలీస్ శాఖకు లేఖలు రాసింది. దీంతో నగరంలోని ఆయా ఠాణాల పోలీసులు బిచ్చగాళ్ల గురించి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అయితే ఎవరు యాచకులు, ఎవరు కాదనే విషయంలో సరైన నిర్ధారణకు రాకుండానే కనిపించిన వాళ్లను కనిపించినట్లు ఎత్తుకెళ్లిపోతున్నారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు.